ప్రజలందరికీ మంచి జరగాలి
రాజమహేంద్రవరం రూరల్: నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని భగవంతుడిని కోరుకుంటున్నానని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయనను కలిసేందుకు బుధవారం బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ వైస్ ఎంపీ నక్కా రాజబాబు, ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులు రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు మింది నాగేంద్ర, గిరిజాల వీర్రాజు (బాబు), కడియం మండల అధ్యక్షుడు యాదల సతీష్‌చంద్రస్టాలిన్ తదితరులు ఆయనను కలిశారు.
జగనన్న పాలన ఒక పండగ
రాజమహేంద్రవరం సిటీ: గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో జగనన్న పాలనలో ప్రతి రోజూ ఒక పండగలా గడిచిందని, ప్రస్తుతం కూటమి పాలనలో ప్రజలను ఇబ్బందులు వెంటాడుతున్నాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ప్రకాశం నగర్‌లోని ఆయన నివాసంలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం అందించే సంక్షేమ కార్యక్రమాలతో వార్షిక క్యాలెండర్‌ను ప్రకటించి, అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. సూపర్ సిక్స్‌తో పాటు అనేక హామీలిచ్చి, ప్రజలను మరోసారి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. కనీసం ఈ కొత్త సంవత్సరంలోనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. లేదంటే ప్రజలే తిరుగుబాటు చేసి కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు వస్తాయని హెచ్చరించారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీహెచ్‌బీసీ మాజీ చైర్‌పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాజమహేంద్రవరం, రూరల్, రాజానగరం నియోజక వర్గాల నుంచి పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలోతరలివచ్చారు.
మాజీ మంత్రి వేణు
ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
జక్కంపూడి రాజా
ఇంట పార్టీ శ్రేణుల సందడి
Comments
Please login to add a commentAdd a comment