పలువురికి కారుణ్య నియామకాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తూ మరణించిన ఉద్యోగుల వారసులకు జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు శుక్రవారం కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేశారు. ఇటీవలి కాలంలో ఏడుగురు మరణించగా వారి వారసులను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించారు. ఇద్దరు రికార్డ్ అసిస్టెంట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ నియామక ఉత్తర్వులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ విప్పర్తి మాట్లాడుతూ, ఖాళీలు ఏర్పడగానే ఎప్పటికప్పుడు నిబంధనల మేరకు కారుణ్య నియామకాలు చేపడుతున్నామని అన్నారు. ఉద్యోగుల పదోన్నతులకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తగా నియామక ఉత్తర్వులు అందుకున్న ఉద్యోగులు కష్టపడి పని చేసి, మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment