తీరంలో తాబేళ్ల మృత్యువాత
కాలుష్యమే కారణమంటున్న మత్స్యకారులు
కొత్తపల్లి: మండల పరిధిలో ఉన్న తీరప్రాంతంలో సముద్ర తాబేళ్లు తరచూ మృత్యువాత పడుతూ ఒడ్డుకు చేరుకుంటున్నాయి. సముద్రంలో రోజురోజుకు కాలుష్యం పెరగడం వలనే తాబేళ్లు మృతి చెందుతున్నట్టు స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రం సమీపంలో ఉన్న హేచరీలు, పరిశ్రమలు విడుదల చేసే విషపూరితమైన రసాయనాలు కలిసిన నీటిని, వ్యర్థాలను సముద్రంలో విచ్చలవిడిగా విడిచిపెడుతున్నారు. ఈ కలుషిత నీరు కారణంగా సముద్రంలో జీవించే వందలాది తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించడం వల్ల పరిశ్రమలు విష రసాయనాలు సముద్రంలోకి యథేచ్ఛగా విడుదల చేస్తున్నాయని తీర ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment