No Headline
కపిలేశ్వరపురం: మండపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ మండల నాయకుడు నక్కా సింహాచలం మాతృమూర్తి సత్తెమ్మ (102) గురువారం వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆమె తొమ్మిది మందికి జన్మనివ్వగా వారిలో ప్రస్తుతానికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు సత్తెమ్మ మృతికి సంతాపాన్ని, సింహాచలానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఉండ్రాజవరం/తాళ్లరేవు: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు మాధవరాయునిపేట గ్రామాల్లో ఇద్దరు శతాధిక వృద్ధులు గురువారం మృతి చెందారు. ఉండ్రాజవరం గ్రామానికి చెందిన మృతురాలు మాదాసు రావమ్మ (106) భర్త రత్తయ్య 25 సంవత్సరాల క్రితం మృతి చెందారు. అప్పట్లో ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారని మనవడు, ఆలిండియా చిరంజీవి యూత్ వైస్ ప్రెసిడెంట్ కటకం రామకృష్ణ తెలిపారు. రావమ్మకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు, 11 మంది మనవలు, 27 మంది మునిమనవలు, 58 మంది ముదిమనవలు ఉన్నారు.
అలాగే, మండల కేంద్రమైన తాళ్లరేవు గ్రామంలోని మాధవరాయునిపేటకు చెందిన మృతుడు ఇరుసుమండ ఆనందరావు (105) చిన్నతనం నుంచీ కూలి పని చేసుకునేవాడు. తరువాత తాళ్ల తయారీ, చెప్పులు కుట్టే కార్మికుడిగా పని చేసేవాడు. గ్రామంలోని వారందరికీ తలలో నాలుకలా వ్యవహరించేవాడు. బ్రహ్మచారిగా జీవనం సాగించాడు. అతడి యోగక్షేమాలను కుటుంబ సభ్యులు చూసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment