తునిలో భారీ అగ్ని ప్రమాదం
తుని: స్థానిక జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న పాత ఇనుము సామానుల(స్క్రాప్) దుకాణంలో గురువారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల దుకాణంలో అగ్ని కీలలు విస్తరించాయి. భారీగా మంటలు ఎగిసిపడి దుకాణంలో సర్వం కాలిబూడిదైంది. ఈ అగ్ని ప్రమాదంలో రూ. 10 లక్షల వరకూ ఆస్థి నష్టం వాటిల్లినట్లు స్థానిక అగ్నిమాపక అధికారి రాముడు తెలిపారు. ఘటనా స్థలికి కూతవేటు దూరంలో ఎగ్జిబిషన్ ఉన్నా ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తుని, అన్నవరం, నక్కపల్లి నుంచి వచ్చిన ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు. దీనిపై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా సమగ్ర విచారణ చేపట్టి లోతుగా దర్యాప్తు అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని అగ్నిమాపక అధికారి రాముడు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment