ఎన్‌ఐఆర్‌సీఏగా సీటీఆర్‌ఐ
అగ్రగామిగా నిలుపుతాం
వాణిజ్య వ్యవసాయంపై పరిశోధన కోసం ఎన్‌ఐఆర్‌సీఏ అవతరిస్తోంది. దీని ద్వారా లాభసాటి వ్యవసాయం, ఉపాధి అవకాశాలు, పోషకాహారం, నాణ్యమైన ఎగుమతుల కోసం సుస్థిర, శాసీ్త్రయ, సాంకేతిక విధానాలను అభివృద్ధి చేస్తాం. పొగాకు, మిరప, పసుపు, ఆముదం, అశ్వగంధ పంటలపై పరిశోధనలు సాగిస్తాం. వాణిజ్య అంశాల పరిజ్ఞానంతో ఎన్‌ఐఆర్‌సీఏని అగ్రగామిగా నిలుపుతాం.
– డాక్టర్ మాగంటి శేషుమాధవ్, డైరెక్టర్,
ఐసీఏఆర్ – ఎన్‌ఐఆర్‌సీఏ, రాజమహేంద్రవరం
● పొగాకుతో పాటు వాణిజ్య
పంటలపై ఫోకస్
● దేశీయ ఎగుమతుల పెంపునకు తోడ్పాటు
● రైతులకు మరింతగా సేవలు
రాజమహేంద్రవరం రూరల్: ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) ఆధ్వర్యాన పొగాకుపై పరిశోధన, పంట అభివృద్ధికి నిర్దేశించిన కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ (ఐసీఏఆర్ – సీటీఆర్‌ఐ) జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐసీఏఆర్ – ఎన్‌ఐఆర్‌సీఏ)గా రూపాంతరం చెందనుంది. తద్వారా భవిష్యత్తులో పొగాకు మాత్రమే కాకుండా పలు వాణిజ్య పంటల అభివృద్ధికి కూడా కృషి చేయనుంది. ఆయా పంటలు సాగు చేసే రైతులకు సమగ్ర సేవలు అందించనుంది. ఎన్‌ఐఆర్‌సీఏను మంగళవారం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, టర్మరిక్ బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్ శర్మ ప్రారంభిస్తారు.
ఇదీ చరిత్ర
బ్రిటిష్ పాలనలో మన దేశంలో ఇంపీరియల్ అగ్రికల్చరల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటైంది. దీని ఆధ్వర్యాన 1936లో సిగరెట్ పొగాకు పరిశోధన కేంద్రం గుంటూరులో ఏర్పాటు చేశారు. 1943–44లో పొగాకుపై ఎకై ్సజ్ సుంకం విధించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఈ నేపథ్యంలో నాటి ప్రభుత్వం ఇండియన్ సెంట్రల్ టొబాకో కమిటీ (ఐసీటీసీ) 1945లో ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఐసీఏఆర్ ఆధ్వర్యాన 1947లో సీటీఆర్‌ఐ ఏర్పాటైంది. గుంటూరు, కందుకూరు, జీలుగుమిల్లి, తమిళనాడులోని వేదసందూర్, కర్ణాటకలోని హున్‌సూర్, పశ్చిమ బెంగాల్‌లోని దిన్హాటాలలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా పొగాకు ఉత్పత్తులపై పరిశోధన, పంటల అభివృద్ధికి కృషి జరిగింది. వీటితో పాటు మన రాష్ట్రంలోని కలవచర్ల, కందుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా కూడా కార్యకలాపాలు సాగేవి. ఆయా కేంద్రాల ద్వారా పొగాకు పరిశోధనలో కీలక ఘట్టాలను ఆవిష్కరించారు.
మార్పు ఎందుకంటే..
ప్రజారోగ్యం దృష్ట్యా పొగాకు వినియోగం తగ్గడం సాగు, ఉత్పత్తిలో ఎదురవుతున్న పలు సవాళ్లతో విదేశీ మారక ద్రవ్యం పొందేందుకు అవకాశమున్న ఇతర వాణిజ్య పంటలపై సీటీఆర్‌ఐ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఈ సంస్థ ఎన్‌ఐఆర్‌సీఏగా రూపాంతరం చెందుతోంది. వాణిజ్య పంట ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా మన దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఆర్‌సీఏ ద్వారా మిరప, పసుపు, ఆముదం, అశ్వగంధ వంటి వాణిజ్య పంటలపై పరిశోధన – సాంకేతిక అభివృద్ధి, ప్రాసెసింగ్, విలువ జోడింపునకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా దేశీయ వ్యవసాయ ఎగుమతులు పెంచాలని నిర్ణయించింది. తద్వారా ఈ పంటలకు అతి పెద్ద ఉత్పత్తిదా రుగా మన దేశాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేయనున్నా రు. మన దేశం ఉత్పత్తి చేసే పొగాకుకు అంతర్జాతీయంగా అత్యంత డిమాండ్ ఉన్నందున దీని సాగుకు తోడ్పాటు అందిస్తూనే, వాణిజ్య పంటలపై కూడా ఎన్‌ఐఆర్‌సీఏ దృష్టి పెట్టనుంది. పసుపు ఎగుమతుల ద్వా రా ఆదాయాన్ని పెంచడంతో పాటు, పసుపు పొడి, ఇమ్యూనిటీ బూస్టర్లు, సబ్బులు, క్యాప్సూల్స్ తదితర ఉత్పత్తులను తయారు చేయనుంది. అలాగే గ్రీన్ చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అశ్వగంధ చూర్ణం, గుళికలు, టీ బ్యాగ్‌లను ఎన్‌ఐఆర్‌సీఏ ద్వారా తయారు చేస్తున్నారు. ఆముదం నూనెలు, పెయింట్లు, రెసిన్లు, ఫ్లాస్టిసైజర్లు, కొవ్వు, ఆల్కహాల్, ఆముదం ఉప ఉత్పత్తులతో పాటు, అత్యధిక అంతర్జాతీయ మార్కెట్‌ను కై వసం చేసుకోవడంపై దృష్టి సారించనున్నారు. వీటి ద్వారా రైతులకు ఆదాయం పెంచడంతో పాటు, దేశానికి విదేశీ మారకద్రవ్యం కూడా లభిస్తుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment