అహంకారాన్ని దూరం చేసుకుంటేనే ఆనందం
రాజమహేంద్రవరం రూరల్: నేను, నాది అనే అహంకారాన్ని దూరం చేసుకుంటే స్వార్థ రహిత సేవ ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చునని మహా సహస్రావధాని పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు అన్నారు. భగవాన్ సత్యసాయి బాబా శతజయంత్యుత్సవాల సందర్భంగా స్థానిక సత్యసాయి గురుకులంలో ప్రేమ, సేవ అనే అంశంపై ఆయన ఆదివారం రాత్రి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. బ్రహ్మజ్ఞానం లేనప్పుడు ఎన్ని చదువులు చదివినా సార్థకత ఉండదన్నారు. ఆధ్యాత్మికతలోని శాసీ్త్రయతను గుర్తించి, ఆత్మజ్ఞానం పొంది సేవ, ప్రేమ అలవర్చుకోవడానికి నిరంతర సాధన చేయాలని సూచించారు. వార్ధక్యాన్ని వరంగా భావిస్తూ, గత జ్ఞాపకాలను ఒంటరిగా స్మరించుకుంటూ ఆధ్యాత్మిక పయనం సాగించాలన్నారు. డబ్బు, పొగడ్త, భయం వంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ఎవరి గురించి వారే ఆలోచించి, కష్టాన్ని కూడా సుఖంగా మార్చుకోవాలని సూచించారు. చిత్తశుద్ధితో చేసే ఏ పనైనా మోక్షాన్ని అందిస్తుందని చెప్పారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి అనేక సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టి 250 దేశాల్లో ఉన్న సత్యసాయి సేవా సంస్థలను స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవలో నేటి యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులకు సేవ, పితృకార్యాలు చేయడంలో అశ్రద్ధ వద్దని, జీవ కారుణ్యం పెంచుకోవాలని గరికిపాటి సూచించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు బులుసు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సత్య సాయిబాబా శతజయంత్యుత్సవాల సంద ర్భంగా నవంబర్ 23 వరకూ పలు సమాజ సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల కాకినాడ, కోనసీమ జిల్లాల అధ్యక్షులు యార్లగడ్డ గోవిందరాజులు, అడబాల వెంకటేశ్వరరావు, గురుకులం కరస్పాండెంట్ అయోధ్యుల శ్యాంసుందర్, ప్రిన్సిపాల్ గురవయ్య, ప్రముఖ వైద్యులు గోలి రామారావు తదితరులు గరికిపాటిని ఘనంగా సత్కరించారు. రంగంపేటకు చెందిన సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ సబ్బు బిళ్ళపై గరికిపాటి ముఖచిత్రాన్ని చిత్రీకరించి బహూకరించారు.
రూ.3.78 కోట్లతో
హాస్టళ్లకు మరమ్మతులు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం) జిల్లాలోని 24 సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ వసతి గృహాల్లో రూ.3.78 కోట్లతో మరమ్మతులు చేపట్టనున్నామని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులతో పైకప్పు, ఫ్లోరింగ్ మరమ్మతులతో పాటు తాగునీరు, మరుగుదొ డ్లు, కరెంటు పనులు, దోమల నివారణ మెష్‌ల ఏర్పాటు, బాలికల వసతి గృహాలకు ప్రహరీల నిర్మాణం వంటి పనులు చేపడతామని వివరించారు. గోపాలపురం నియోజకవర్గంలో 10 హాస్టళ్లకు రూ.144.84 లక్షలు, రాజమహేంద్రవరం సిటీలో ఆరింటికి రూ.70.01 లక్షలు, రాజమహేంద్రవరం రూరల్‌లో రెండింటికి రూ.32.51 లక్ష లు, గోకవరం మండలంలో ఒక హాస్టల్‌కు రూ. 17.05 లక్షలు, రాజానగరం నియోజకవర్గంలో ఒక హాస్టల్‌కు రూ.11.05 లక్షలు, రంగంపేటలో ఒక హాస్టల్‌కు రూ.11.29 లక్షలు, కొవ్వూరులో రెండింటికి రూ.52.53 లక్షలు, నిడదవోలు నియోజకవర్గంలో 3 హాస్టళ్లకు రూ.38.32 లక్షల చొప్పున కేటాయించామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment