చిత్ర కళలోని లోతులను అన్వేషిస్తున్నాం
దేశంలో ఎక్కడ చిత్ర కళాపోటీలు జరిగినా, చిత్ర కళా ప్రదర్శలు ఏర్పాటైనా వాటికి హాజరై తమ చిత్ర ప్రతిభను ప్రదర్శించడమే కాదు చిత్ర కళలోని లోతును అన్వేషిస్తున్నాం. కోనసీమ చిత్ర కళా పరిషత్ ఏటా నిర్వహించే జాతీయ పోటీల్లోనే కాదు చిత్ర కళా ప్రదర్శనల్లో కూడా పాల్గొంటున్నాను. వేల భావాలు తెలిపే చిత్ర కళా రంగమంటే నాకు ప్రాణం. ఆ అభిమానంతోనే మూడు దశాబ్దాలుగా చిత్రాలతోనే జీవిస్తున్నాను.
– హేమా కుట్నికర్, పూణె, మహారాష్ట్ర
51 జాతీయ చిత్రకళా
పోటీల్లో పాల్గొన్నా
నేను ఇప్పటి వరకూ 51 జాతీయ చిత్ర కళా పోటీల్లో పాల్గొన్నాను. నేను గీసిన చిత్రాలకు బహుమతులు సాధించాను. మూడు దేశాల్లో ప్రపంచ చిత్ర కళా పోటీల్లో నా చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. అమలాపురంలో అవర్ ఆర్టిస్ట్స్ పుస్తక సమీక్షకు నన్ను ఓ చిత్రకారుడిగా ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రదర్శితమైన చిత్రాలన్నీ ఒక దానికి మించి ఒకటి భావగర్భితంగా ఉన్నాయి.
– రహమాన్ పటేల్,
చిత్రకారుడు, గుల్బర్గా, కర్ణాటక
అమలాపురం చిత్ర ప్రదర్శనకు
నాలుగోసారి
జాతీయ చిత్ర కళా ప్రదర్శనకు నేను రావడం ఇది నాలుగోసారి. కోనసీమ చిత్ర కళా పరిషత్ నిర్వహిస్తున్న జాతీయ చిత్ర కళా పోటీల్లో నా చిత్రం ప్రత్యేక బహుమతి సాధించింది. రెండున్నర దశాబ్దాల్లో నా చిత్ర కళకు మెచ్చి అనేక అవార్డులు తీసుకున్నాను. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ నిర్వహించే ప్రతి పోటీలోనూ నేను పాల్గొని అవార్డు కైవసం చేసుకున్నాను.
– శ్రీమంతులు శ్రీదేవి,
చిత్రకారిణి, హైదరాబాద్
ఐదుసార్లు అవార్డులు పొందాను
కోనసీమ చిత్ర కళా పరిషత్ ఏటా నిర్వహించే జాతీయ చిత్ర కళా పోటీల్లో పొల్గొంటూనే ఉంటాను. అయితే గత 35 ఏళ్లలో ఇప్పటి వరకూ 5 సార్లు ఈ పరిషత్ ద్వారా నేను గీసిన చిత్రాలకు అవార్డులు వచ్చాయి. నాలాంటి చిత్రకారులను ఎందరినో పరిషత్ ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకు వచ్చింది. నేను గీసిన చిత్రం ఈ జాతీయ పోటీల్లో అవార్డు పొందడమే కాకుండా జాతీయ చిత్రకళా ప్రదర్శనలో ప్రదర్శితం కావడం మరీ ఆనందం కలిగించింది.
– కాదూరి రామకృష్ణ, చిత్రకారుడు, బొబ్బిలి
Comments
Please login to add a commentAdd a comment