ముమ్మిడివరం: పదో తరగతి చదువుతున్న బాలికను వేధింపులకు గురి చేస్తున్నాడన్న నెపంతో ఓ బాలుడిపై బాలిక తండ్రి బ్లేడుతో దాడి చేయగా పలుచోట్ల గాయాలయ్యాయి. ముమ్మిడివరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముమ్మిడివరం బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఓ బాలికను ముమ్మిడివరం బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న బాలుడు తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడని బాలిక తండ్రి పలు సార్లు బాలుడి కుటుంబ సభ్యులకు చెప్పి బాలుడిని హెచ్చరించారు. అయితే ఆ బాలుడు మంగళవారం సాయంత్రం స్థానిక బేకరి వద్ద స్నాక్స్ కొనుగోలు చేస్తుండగా ఆ బాలిక తండ్రి వచ్చి బ్లేడుతో దాడి చేసి తీవ్రంగా గాయ పర్చాడని బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాయాలైన ఆ బాలుడిని ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ జీబీ స్వామి తెలిపారు. దాడి చేసిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment