ఆదిత్య విద్యార్థుల వినూత్న ప్రయత్నం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడానికి కాకినాడ ఆదిత్య విద్యార్థులు వినూత్న ప్రయత్నం చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, జాతీయ చేతి రాత దినోత్సవం సందర్భంగా జేఎన్‌టీయూకేలో గురువారం దాదాపు 2,200 మంది విద్యార్థులతో హ్యాండ్ రైటింగ్ మారధాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య గ్రూప్ చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జీవిత చరిత్ర ఆదిత్య విద్యార్థులతో కలిసి రాయడమనేది చాలా గొప్పవిషయమన్నారు. ఆరు సంవత్సరాలుగా తమ విద్యార్థులు హ్యాండ్‌రైటింగ్ శిక్షణ పొందుతూ నైపుణ్యాన్ని కై వసం చేసుకున్నారన్నారు. ఈ నైపుణ్యంతో ఈసారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులలో చోటు పొందేందుకు వినూత్న ప్రయత్నం చేశారన్నారు. జేఎన్‌టీయూకే ఇన్‌చార్జి వీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమానికి తమ వర్సిటీ వేదిక అవ్వడం సంతోషంగా ఉందన్నారు. మూడవ అదనపు జిల్లా జడ్జి పి.కమలాదేవి, స్కూల్ డైరెక్టర్ శృతిరెడ్డి, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీదిలీప్‌పాత్రో, సద్గురు అకాడమి చైర్మన్ మహాలక్ష్మి, సింగర్ కొండేపూడి యసశ్వి, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment