రోగ నిరోధక శక్తి పెంపుతోటీబీ నుంచి విముక్తి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): బలవర్ధకమైన ఆహారంతో పాటు వ్యాయామం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తద్వారా క్షయ వ్యాధి (టీబీ) నుంచి విముక్తి పొందవచ్చని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ప్రధానమంత్రి టీబీ విముక్తి భారత్ కార్యక్రమం స్ఫూర్తితో నిక్షయ్ మిత్ర హోదాలో ఆమె గురువారం ఒక బాలికను దత్తత తీసుకున్నారు. కలక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, క్షయ వ్యాధిని జిల్లా నుంచి పారదోలెందుకు స్వచ్ఛందంగా నిక్షయ్ మిత్రలుగా పేర్లు నమోదు చేసుకుని, టీబీ బాధితులను దత్తత తీసుకుని, ప్రభుత్వం అందించే పోషణ పథకానికి చేయూతనివ్వవచ్చని తెలిపారు. దత్తత తీసుకున్న వారు ఒక్కో వ్యక్తికి నెలకు రూ.700 చొప్పున ఆరు నెలల పాటు రూ.4,200 ఆర్థిక సహాయం చేయాలని, ఈ మొత్తంతో టీబీ బాధితులకు పౌష్టికాహార కిట్లు అందజేస్తామని చెప్పారు. టీబీ నిర్మూలనకు వ్యాపారవేత్తలు, అధికారులు, ప్రజలు ముందుకు రావాలని కలెక్టర్ ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ ఎన్.వసుంధర మాట్లాడుతూ, ఆర్థిక సహాయం అందించదలచిన వారు నిక్షయ్ మిత్ర అకౌంట్‌కు నేరుగా జమ చేయవచ్చని, లేదా కలెక్టరేట్‌లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment