![వైఎస్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05rjc239a-270086_mr-1738780978-0.jpg.webp?itok=e93yUGww)
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాలకు నియామకాలు
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో రాజమహేంద్రవరం నగరానికి చెందిన ఇద్దరు నాయకులను జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులుగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిటీ నియోజవర్గానికి చెందిన ముస్లిం నాయకుడు మహమద్ హబీబుల్లా ఖాన్‌ను జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా నియమించారు. అలాగే, జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడిగా నగరానికి చెందిన గుడాల జాన్సన్ నియమించారు.
ఎత్తిపోతల పథకాలకు
పూర్వ వైభవం
కొవ్వూరు: ఎత్తిపోతల పథకాలకు పూర్వ వైభవం తీసుకోచ్చేలా చర్యలు తీసుకుంటామని ఏపీ ఎస్‌ఐడీసీ ఎండీ వై.శ్రీనివాస్ ప్రకటించారు. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయిప్రసాద్ ఆదేశాల మేరకు గోదావరి నదిపై ఎత్తిపోతల పథకాలను బుధవారం ఆయన పరిశీలించారు. స్కీమ్‌ల నిర్వహణ తీరుపై రైతు సంఘాల నాయకులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎత్తిపోతల పథకం పనితీరుపై రైతులను ఆరా తీశారు. కుమారదేవం, తాళ్లపూడి మండలంలో వేగేశ్వరపురం, పైడిమెట్ట, పోలవరం మండలంలోని గుటాల, పోలవరం ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు రూ.20 కోట్లతో ప్రతిపాదనలు పంపించామని ఆది శేషారావు వివరించారు. నీటి తీరువా సక్రమంగా వసూలు కావడం లేదని రైతుసంఘం ప్రతినిధులు తెలిపారు. ఎత్తిపోతల పథకం నిర్వహణ సక్రమంగా కొనసాగాలంటే రైతులు కచ్చితంగా నీటి తీరువా చెల్లించాల్సి ఉంటుందని ఎండీ శ్రీనివాస్ పేర్కొన్నారు. రైతు సంఘం అధ్యక్షులు గొరిజాల సురేష్, కై గాల రాంబాబు, వట్టికూటి వెంకటేశ్వరరావు, డీఈఈ పి.దుర్గా గురవయ్య, ఏఈ ఎ.సురేంద్ర, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.
రైతు సేవా కేంద్రాల్లో
నమోదు చేయించుకోవాలి
రాజమహేంద్రవరం రూరల్: రైతులు రైతు సేవా కేంద్రాలకు వెళ్లి కొత్తగా ప్రవేశపెట్టిన అగ్రిస్టాక్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు అన్నారు. రాజవోలు రైతు సేవా కేంద్రంలో అగ్రిస్టాక్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తీరును బుధవారం ఆయన పరిశీలించారు. రిజిస్ట్రేషన్‌లో ఇంకా ఏవైనా తప్పులుంటే రికార్డ్ చేసుకుని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలిపారు. పీఎం కిసాన్ పథక కింద దీని ద్వారానే లబ్ధి అందుతుందన్నారు. సిబ్బంది రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వంద శాతం చూపిస్తేనే ఆ రికార్డు నేరుగా తహసీల్దార్ లాగిన్‌కు అప్రూవల్‌కు వెళ్తుందని, 80 శాతం కన్నా తక్కువ ఉంటే వీఆర్వో లాగిన్‌లోకి వెళ్తుందని చెప్పారు. ఆధార్, సంబంధిత సర్వే నంబర్లలో ఏవైనా తప్పులుంటే వీఆర్వో సరిచేసి, మళ్లీ తహసీల్దార్ లాగిన్‌కు పంపుతారన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం 21 అంకెలతో గుర్తింపు నంబర్ ఆయా రైతుల మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుందని తెలిపారు. ఆధార్ కార్డ్, కొత్తగా వచ్చిన ఎల్పీ నంబర్‌తో కూడిన 1బి/పాస్ బుక్ జిరాక్స్, రేషన్ కార్డ్, ఆధార్ లింక్ అయిన ఫోన్ తీసుకుని రైతులు రైతు సేవా కేంద్రానికి వెళ్లాలని మాధవరావు సూచించారు.
![వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాలకు నియామకాలు 1](https://www.sakshi.com/gallery_images/2025/02/6/05rjc239-270086_mr-1738780979-1.jpg)
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాలకు నియామకాలు
Comments
Please login to add a commentAdd a comment