![తక్షణం విడుదల చేయాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05rjc902-603659_mr-1738780979-0.jpg.webp?itok=J0ldB1MD)
తక్షణం విడుదల చేయాలి
ఆదాయం లేని మసీదుల్లోని ఇమామ్, మౌజన్‌లకు గౌరవ వేతనాలు చెల్లించడంలో గతంలో ఎన్నడూ లేనంతగా తీవ్ర నిర్లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. నెలల తరబడి నిధుల విడుదల చేయకపోతే మసీదుల నిర్వహణ ఎలా సాధ్యం? పది నెలలుగా వేతనాలు లేక ఇమామ్, మౌజన్‌లు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ పరిస్థితి తలెత్తింది. గౌరవ వేతనంతో పాటు మసీదుల నిర్వహణకు నెలకు రూ.5,000 అందిస్తామని ఇచ్చిన హామీ ఎప్పుడు అమలు చేస్తారు? వేతన బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
– మొహమ్మద్ ఆరిఫ్,
జిల్లా మాజీ వక్ఫ్‌బోర్డ్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment