![జిల్లాలో ఇలా..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05rjc901-603659_mr-1738780979-0.jpg.webp?itok=n8PZJX92)
జిల్లాలో ఇలా..
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించిన మసీదులు 118 ఉన్నాయి. వీటిలో 118 మంది ఇమామ్, 118 మంది మౌజన్‌లు విధులు నిర్వర్తిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలు కారణంగా గతంలో రెండు నెలల బకాయిలు నిలిచిపోయాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి నేటి వరకూ సుమారు ఎనిమిది నెలలు అంటే.. పది నెలలకు సంబంధించి గౌరవ వేతనాన్ని విడుదల చేయాల్సి ఉంది. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 118 మంది ఇమామ్‌లకు ఒక్కో నెలకు రూ.10 వేల చొప్పున పది నెలలకు రూ.1.18 కోట్లు, మౌజన్లకు ఒక్కొక్కరికి నెలకు రూ.5 వేల చొప్పున పది నెలలకు రూ.59 లక్షలు.. కలిపి మొత్తం రూ.1.77 కోట్ల మేర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉన్నా.. పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందో అంతు చిక్కని ప్రశ్నగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment