![వరప్రసాదరావు - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/16/15elr127-290071_mr_0.jpg.webp?itok=NIFR45Da)
వరప్రసాదరావు
ఏలూరు టౌన్ / జంగారెడ్డిగూడెం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన పలువురు నేతలకు పార్టీ పదవులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా పెరికే వరప్రసాదరావు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా వీజీఎం అచ్యుత రామరావు, అలాగే ఉభయగోదావరి జిల్లాల బూత్ కమిటీల కో–ఆర్డినేటర్ బీవీఆర్ చౌదరిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వీరంతా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి, పార్టీ అభ్యర్థుల విజయానికి తమవంతు కృషి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
![అచ్యుతరావు
1](https://www.sakshi.com/gallery_images/2024/03/16/15elr128-290071_mr.jpg)
అచ్యుతరావు
![బీవీఆర్ చౌదరి 2](https://www.sakshi.com/gallery_images/2024/03/16/15jrg07-290011_mr.jpg)
బీవీఆర్ చౌదరి
Comments
Please login to add a commentAdd a comment