![పీ4 ప్రణాళికలను రూపొందిస్తాం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06elr103-290007_mr-1738868493-0.jpg.webp?itok=-GseFo2P)
పీ4 ప్రణాళికలను రూపొందిస్తాం
ఏలూరు (మెట్రో): రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన పది సూత్రాలతో సామాజిక, ఆర్థిక, సాధికారత, స్థిరమైన అభివృద్ధిని సాధించే దిశలో భాగంగా ఏలూరు జిల్లాలో పీ4 (పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్టిసిపేషన్) కార్యక్రమానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా కార్యాచరణ ప్రణాళికలను నిర్ధేశించిన సమయంలోగా రూపొందిస్తామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు తెలియజేశారు. ‘స్వర్ణాంధ్ర–2047’ లక్ష్యసాధనలో భాగంగా పది సూత్రాలతో పీ4 ప్రణాళికల రూపకల్పనపై సెక్రటేరియట్ నుంచి గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్‌స ద్వారా సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో మాట్లాడుతూ పీ4 ప్రణాళిక నిమిత్తం జిల్లాలో నియోజకవర్గాల వారీగా ప్రణాళికలను త్వరితగతిన రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సీఈఓ కె.సుబ్బారావు, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ అధికారి విజయరాజు, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, సీపీఒ సీహెచ్ వాసుదేవరావు, జిల్లా పంచాయతీ అధికారి అనురాధ, డీఈఓ వెంకట లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
సీఎస్‌కి తెలియజేసిన కలెక్టర్ వెట్రిసెల్వి
Comments
Please login to add a commentAdd a comment