![శిశు ఆధార్ సర్టిఫికెట్ సేవలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06elr123-290071_mr-1738868492-0.jpg.webp?itok=tfQrP5es)
శిశు ఆధార్ సర్టిఫికెట్ సేవలు
ఏలూరు టౌన్: కేంద్ర సర్కారు నూతనంగా అమలు చేస్తున్న శిశు ఆధార్ సర్టిఫికెట్‌ను శిశువు పుట్టిన వెంటనే మంజూరు చేసేలా చర్యలు చేపట్టినట్లు ఏలూరు సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు చెప్పారు. గురువారం ఏలూరు జీజీహెచ్‌లోని ఎంసీహెచ్ వార్డులో నవజాత శిశువుకు శిశు ఆధార్ సర్టిఫికెట్‌ను నమోదు చేసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన శిశువులకు శిశు ఆధార్ నమోదు చేసి వారు హాస్పటల్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలోనే జనన ధ్రువీకరణ పత్రంతో పాటు శిశు ఆధార్‌ను ఇచ్చి పంపేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిశు ఆధార్ కోఆర్డినేటర్ డాక్టర్ లావణ్య, ఆధార్ కోఆర్డినేటర్ హరిప్రసాద్, నర్సింగ్ సూపరింటెండెంట్లు విజయలక్ష్మి, రంగలక్ష్మి, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉన్నారు.
నరసాపురంలో చైన్‌స్నాచింగ్
నరసాపురం: నరసాపురం పట్టణంలో మహిళ మెడలో బంగారు గొలుసును చైన్‌స్నాచింగ్ చేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం రుస్తుంబాద వద్ద 216 జాతీయ రహదారిని ఆనుకుని అరే ప్రాంతానికి చెందిన పంపన జయభారతి చిన్న కిరాణా దుకాణం నడుపుకుంటుంది. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో షాపు కట్టేసి, ఆమె బయట నిలుచున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న నల్లపూసల దండ, మరో బంగారు చైన్ లాక్కుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment