కూలీల ఉసురు తీసిన అతివేగం
ఉంగుటూరు (గణపవరం): ఆగి ఉన్న లారీని కంటైనర్ లారీ ఢీకొనడంతో ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద ఈ ప్రమాదం జరిగింది. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్‌కు చెందిన ఒక ఊకలారీపై కృష్ణాజిల్లా బావులపాడు మండలం ఆరుగొలనుకు చెందిన డి.దేవమందిరం (36), గోగులమూడి విజయబాబు (38) పనిచేస్తున్నారు. ఈనెల 5వ తేదీ బుధవారం హనుమాన్ జంక్షన్‌లో ఊకలోడు చేసుకుని తాడేపల్లిగూడెంలో దిగుమతి చేసి, తిరిగి హనుమాన్‌జంక్షన్ వెళ్తుండగా, గురువారం వేకువజామున 2.30 గంటల సమయంలో ఉంగుటూరు మండలం నాచుగుంట వచ్చేసరికి లారీ బ్రేడ్‌డౌన్ అయినట్లు లారీ డ్రైవర్ కిషోర్ గుర్తించారు. లారీ డ్రైవర్‌తో పాటు లారీలో ఉన్న ఇద్దరు కూలీలు లారీ దిగి లారీ క్రిందకు వెళ్లి పరిశీలిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో వైజాగ్‌నుంచి వస్తున్న హెచ్‌ఆర్58డి 4993నంబరు గల కంటైనర్ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కూలీలు దేవమందిరం, విజయబాబు అక్కడికక్కడే మృతి చెందారు. అదృష్టవశాత్తూ లారీ డ్రైవర్ కిషోర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. హైవే అంబులెన్స్ వారు వచ్చి మృతదేహాలను గూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో లారీను పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. గాయపడిన కంటైనర్ డ్రైవర్‌ను చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్ తెలిపారు.
ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొన్న కంటైనర్
ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం
కూలీల ఉసురు తీసిన అతివేగం
Comments
Please login to add a commentAdd a comment