![అన్న చేతిలో తమ్ముడు హతం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06bvrmka04-290045_mr-1738868492-0.jpg.webp?itok=8GT77Ufb)
అన్న చేతిలో తమ్ముడు హతం
కాళ్ళ: స్థలం కోసం జరిగిన గొడవలో సొంత అన్నయ్య చేతిలో తమ్ముడు హతమయ్యాడు. ఈ ఘటనపై కాళ్ళ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సై శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం పెదఅమిరం గ్రామానికి చెందిన ఇలవల రమేష్ (29), వరలక్ష్మి దంపతులు. భర్తతో మనస్పర్థల కారణంగా వరలక్ష్మి సుమారు మూడేళ్ల నుంచి పిల్లలతో కలసి పుట్టింటి వద్ద నివాసం ఉంటుంది. తమ తల్లికి చెందిన ఒక సెంటు స్థలం విషయంలో రమేష్, తన అన్నయ్య సత్యనారాయణ తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. ఈ క్రమంలో 2023లో ఇద్దరు ఒకరిపై ఒకరు కేసు పెట్టుకుని కోర్టులో రాజీపడ్డారు. అయినా అప్పటి నుంచి స్థలం కోసం గొడవపడుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి రమేష్ తన అన్న ఇంటికి వెళ్లి గొడవపడుతున్న సమయంలో సత్యనారాయణ కర్రతో రమేష్ తలపై కొట్టడంతో తీవ్ర గాయమైంది. చుట్టుపక్కల వారు రమేష్‌ను భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతదేహాన్ని ఆకివీడు రూరల్ సీఐ జగదీశ్వరరావు పరిశీలించారు. రమేష్ భార్య వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment