మంగమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులు
బుట్టాయగూడెం: కార్తీక మాసం రెండో ఆదివారం గుబ్బల మంగమ్మ తల్లి గుడికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే భక్తులు భారీగా తరలి వచ్చి మంగమ్మతల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏపి, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు దర్శనానికి వచ్చినట్లు ఆలయ కమిటీ నాయకులు, సర్పంచ్ కోర్స గంగరాజు తెలిపారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, మినీ బస్సుల్లో భక్తులు తరలి వచ్చారు. మర్లగూడెం అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న పాటమ్మతల్లిని, పసుపులమ్మ తల్లిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెలించుకున్నారు.
పేకాట శిబిరాలపై దాడులు
ముసునూరు: రెండు గ్రామాల్లో పేకాట శిబిరాలపై మెరుపు దాడులు చేసి, ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. గోపవరంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం సాయంత్రం సిబ్బందితో కలిసి దాడిచేశారు. దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకొని, వారి నుంచి రూ.3,400 నగదు, చింతలవల్లిలో పేకాడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని రూ.1,050 స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment