చట్టాలపై నైపుణ్యం పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై నైపుణ్యం పెంచుకోవాలి

Published Sun, Dec 22 2024 1:10 AM | Last Updated on Sun, Dec 22 2024 1:10 AM

చట్టా

చట్టాలపై నైపుణ్యం పెంచుకోవాలి

ఏలూరు (టూటౌన్‌): మారుతున్న చట్టాలపై న్యాయమూర్తులు అవగాహన పెంచుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్‌ పిలుపునిచ్చా రు. ఏలూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులకు ఒక రోజు శిక్షణ తరగతులను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పురుషోత్తంకుమార్‌ మాట్లాడుతూ శిక్షణా తరగతిలో ఫ్రెమింగ్‌ ఆఫ్‌ చార్జెస్‌, సెక్షన్‌ 311, 313, 319 సీఆర్‌పీసీ, బాధితులు–పరిహారం మొదలైన చట్టాలపైన అవగాహన కల్పించామన్నారు. రిసోర్స్‌ పర్సన్‌లుగా వైవీ రామకృష్ణ, జీవీ కృష్ణయ్య, ఏపీ సురేష్‌, ఎం.సునీల్‌కుమార్‌ వ్యవహరించారు. న్యాయమూర్తులు పాల్గొన్నారు.

జీతాల కోసం ఆందోళన

ఏలూరు టౌన్‌: ఏలూరు సర్వజన ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్‌ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని ఏపీ మెడికల్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణ మాచార్యులు డిమాండ్‌ చేశారు. శనివారం స్థా నిక జీజీహెచ్‌ వద్ద రెండో రోజు కార్మికులు, నా యకులు ధర్నా చేశారు. చాలీచాలనీ వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న కార్మికులకు నెలల తరబడి జీతాలు చెల్లించకుంటే వారంతా రోడ్డున పడే దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలల బకా యి జీతాలు వెంటనే చెల్లించకుంటే సమ్మె చే స్తామని హెచ్చరించారు. యూనియన్‌ ప్రధా న కార్యదర్శి వి.దత్తాత్రేయ పాల్గొన్నారు.

ప్రాజెక్ట్‌ కమిటీలు ఏకగ్రీవం

ఏలూరు(మెట్రో): జిల్లా సాగునీటి యాజమాన్య కమిటీలకు సంబంధించిన రెండు ప్రాజెక్ట్‌ కమిటీ (పీసీ)లకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల పద వులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ చిలకపాటి దేవప్రకాశ్‌ తెలిపారు. శనివారం తమ్మిలేరు ప్రాజెక్ట్‌ కమిటీ ఎన్నికలు చాట్రాయిలో, ఎర్రకాల్వ ప్రాజెక్ట్‌ కమిటీ ఎన్ని క లు జంగారెడ్డిగూడెంలో నిర్వహించగా చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. త మ్మిలేరు ప్రాజెక్ట్‌ కమిటీకి చైర్మన్‌గా యర్ర రమేష్‌, వైస్‌ చైర్మన్‌గా గుండా వెంకన్న, ఎర్ర కాల్వ ప్రాజెక్ట్‌ కమిటీకి చైర్మన్‌గా వందనపు అంజ నాగ వెంకటరమణ, వైస్‌ చైర్మన్‌గా వాడపల్లి రాధాకృష్ణమూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఇరిగేషన్‌ సర్కిల్‌ ఏస్‌ఈ సీహెచ్‌ దేవప్రకాశ్‌ తెలిపారు.

‘ఓపెన్‌’ ఫీజులు చెల్లించాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప దో తరగతి, ఇంటర్మీడియెట్‌ అభ్యాసకులు పబ్లిక్‌ పరీక్షలకు ఫీజులు చెల్లించాలని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 23 నుంచి 31 వరకు అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు.

డీఎంహెచ్‌ఓగా మాలిని

ఏలూరు టౌన్‌: జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ)గా డాక్టర్‌ ఆర్‌.మాలిని నియమితులయ్యారు. కృష్ణా జిల్లా గుడివాడ ఏరియా ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న ఆమెను ఇక్కడకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఏలూరు డీ ఎంహెచ్‌ఓగా ఉన్న డాక్టర్‌ శర్మిష్టను కృష్ణా జిల్లా డీఎంహెచ్‌ఓగా ప్రభుత్వం బదిలీ చేసింది.

27న యువ ఉత్సవ్‌

ఏలూరు(మెట్రో): జిల్లాలో యువత ప్రతిభను వెలికి తీసేందుకు ఈనెల 27న యువ ఉత్సవా లు నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ కె.వెట్రి సెల్వి తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శనివారం ఆమె యువ ఉత్సవ్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆదిత్య డిగ్రీ కాలేజీలో వేడుకల్లో భా గంగా పలు పోటీలు నిర్వహిస్తామన్నారు. నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి దూలం కిషోర్‌ మాట్లాడుతూ వివరాలకు సెల్‌ 99488 98437లో సంప్రదించాలని కోరారు.

ముగిసిన డీఆర్పీల శిక్షణ

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఎఫ్‌ఎల్‌ఎన్‌ జ్ఞాన జ్యోతి పేరిట స్థానిక సుబ్బమ్మ దేవి మున్సిపల్‌ హైస్కూల్‌లో జిల్లా రిసోర్స్‌ పర్సన్‌ (డీఆర్పీ)లకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమం శనివారంతో ముగిసిందని కోర్స్‌ డైరెక్టర్‌, డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.

27న ‘విజయకేతనం’ అందజేత

ప్రభుత్వ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు ఈనెల 27న విజయ కేతనం పేరున స్టడీ మెటీరియల్‌ అందిస్తామని డీఈఓ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
చట్టాలపై నైపుణ్యం పెంచుకోవాలి 1
1/1

చట్టాలపై నైపుణ్యం పెంచుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement