40 మంది జెడ్పీటీసీలు వైఎస్సార్‌సీపీలోనే..
పెనుమాల విజయ్‌బాబు, జెడ్పీ వైస్ చైర్మన్
ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా, ఆశలు చూ పినా, బెదిరింపులకు పాల్పడినా ఇప్పటికీ 40 మంది జెడ్పీటీసీలు వైఎస్సార్‌సీపీ వైపే ఉన్నారని జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌బాబు అన్నారు. మొత్తం 48 మంది సభ్యుల్లో ఒక స్థానం ఖాళీగా ఉందని, మిగిలిన 47 మందిలో 45 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు ఉన్నారన్నారు. ఇందులో ఐదుగురు సభ్యులు కూటమి వైపు వెళ్లినా.. 40 మంది వైఎస్సార్‌సీపీలోనే ఉన్నామన్నారు. ప్రత్యేక సమావేశానికి 36 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులు హాజరుకాగా నలుగురు వివిధ కారణాలతో రాలేదన్నారు. అందరూ ఏకాభిప్రాయంతోనే ఉన్నామన్నారు.
పదవినీ వదిలేయాలి
చింతలపూడి నీరజ, జెడ్పీపీటీసీ
మహిళగా ఘంటా పద్మశ్రీకి జగన్ అత్యున్నత స్థానం కల్పించారని చింతలపూడి జెడ్పీటీసీ చింతలపూడి నీరజ అన్నారు. వైఎస్సార్‌సీపీలో ఉంటే ప్రజలకు సేవ చేయలేం, నిధులు తీసుకురాలేమన్నది దురభిప్రాయమన్నారు. పార్టీ మారడం జెడ్పీ చైర్‌పర్సన్ విజ్ఞతకే వదిలేశామని, ఆమె పార్టీ ఫిరాయించడం బాధాకరమన్నారు. పార్టీ అక్కరలేనప్పుడు దాని ద్వారా వచ్చిన పదవిని కూడా ఆమె వదిలేయాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment