సంక్షేమ సారథీ.. వర్ధిల్లు వెయ్యేళ్లు
జననేతకు నీరా‘జనం’
● పండుగలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
● సేవా కార్యక్రమాలతో అభిమానం చాటిన పార్టీ శ్రేణులు
● ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల రక్తదాన శిబిరాలు
● పేదలకు దుప్పట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు
జనాభిమానం ఉప్పొంగింది. సేవా సంబరం అంబరాన్నంటింది.. సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధికి ఊరూవాడా నీరా‘జనాలు’ అర్పించారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment