వాడీవేడి.. ఫిరాయింపుపై మండిపడి
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం శనివారం వాడీవేడిగా జరిగింది. పార్టీ మారాల్సిన అవసరం ఏముందంటూ వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ తరఫున ఆమె గెలిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీలో చేరడంపై ఇప్పటికే 30 మందికి పైగా జెడ్పీటీసీలు అవిశ్వాస తీర్మా నం కోరుతూ సీఈఓకు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం ఏలూరు జెడ్పీ సమావేశ మందిరంలో ఇన్‌చార్జి సీఈఓ ఆర్.విజయరాజు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 38 మంది జెడ్పీటీసీలు హాజరు కాగా 36 మంది వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలే ఉన్నారు. ఒకరు టీడీపీ, మరొకరు జనసేన జెడ్పీటీసీలు హాజరయ్యారు.
మహిళలకు జగన్ పెద్దపీట
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత ప్రభుత్వ హయాంలో మహిళలకు పెద్దపీట వేస్తూ పద్మశ్రీని జిల్లాపరిషత్ పీఠంపై కూర్చోబెట్టారని వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ లు అన్నారు. పార్టీకి న మ్మక ద్రోహం చేయడం తగదన్నారు.
సీఈఓని నిలదీసి..
సింగిల్ అజెండాగా పొందుపర్చిన అవిశ్వాస తీ ర్మానం నోటీసుపై సభ ప్రారంభంలోనే జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయ్‌బాబు, ఫ్లోర్‌లీడర్, జెడ్పీటీసీలు పెద్దిరాజు, గోవిందరాజులు నిలదీశారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల్లో నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టడం కుదరదని జెడ్పీ సీఈఓ చెప్పారు. ఈ కారణంగా అవిశ్వాస తీర్మానం నోటీసు వీగిపోయినట్లేనని సమాధానమిచ్చారు. సమావేశం మినిట్స్‌లో ప్రతిదీ పొందుపరచి, దా ని నకలు కాపీని తమకు అందించాలని జెడ్పీటీసీలు కో రగా.. ప్రతిదీ మినిట్స్ బుక్‌లో పొందుపరుస్తామని, స దరు కాపీని పంచాయతీరాజ్ కమిషనర్‌తో పాటు సభ్యులకు అందజేస్తామని సీఈఓ స్పష్టం చేశారు.
జెడ్పీ చైర్‌పర్సన్‌ను నిలదీసిన జెడ్పీటీసీలు
ఉమ్మడి జిల్లాపరిషత్ ప్రత్యేక సమావేశం
అవిశ్వాస తీర్మానం నోటీసు చెల్లదన్న సీఈఓ
Comments
Please login to add a commentAdd a comment