నైతిక విలువలూ నేర్పించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయులు పా ఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ గురించి కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నూతన సంవత్సర డైరీ–2025ను సోమవారం కలెక్టరేట్‌లో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని, పదో తరగతి పరీక్షల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషిచేయాలని కోరారు. జేసీ పి.ధాత్రిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పెంపునకు కృషిచేయాలన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.రామారావు, బి.రెడ్డి దొర, నగర శాఖ ప్రధాన కార్యదర్శి అబ్బదాసరి శ్రీనివాసరావు తదితరు లు పాల్గొన్నారు. అనంతరం డీఈఓ కార్యాల యంలో ఏపీటీఎఫ్ క్యాలెండర్‌ను డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ ఆవిష్కరించారు.
మురుగునీటి పారుదలకు చర్యలు
ఆగిరిపల్లి: మురుగునీటి పారుదలకు సత్వరమే చర్యలు చేపట్టామని ఈ ఓపీఆర్డీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈదర గ్రామంలో దుస్థితిపై ‘రోడ్డుపైనే మురుగునీటి ప్రవాహం’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో కథనం ప్రచురించగా అధికారులు స్పందించారు. సోమవారం పంచాయతీ కార్యదర్శి నిషాక్‌ఆలీ, సర్పంచ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీలోని పూడికను తొలగించారు. రోడ్డుపై మురుగునీరు ప్రవహించకుండా డ్రైనేజీ పైప్‌లైన్‌లు ఏర్పాటు చేస్తున్నామని నిషాక్‌ఆలీ తెలిపారు.
ఎస్సీ కులగణనపై సోషల్ ఆడిట్
ఏలూరు (టూటౌన్) : రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీల జనాభా, వారి వివరాలపై సోషల్ ఆడిట్ నిర్వహణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఎస్సీ కులగణన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించామని, దీనిపై అభ్యంతరాలు ఉంటే మంగళవారం వరకు స్వీకరిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ జేడీ వి.జయప్రకాష్ ప్రకటనలో తెలిపారు. జనవరి 6 వరకు అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. సమగ్ర వివరాల సేకరణ అనంతరం జనవరి 10న కులగణన తుది వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తామన్నారు. సోషల్ ఆడిట్‌ను కలెక్టర్, ఆర్డీఓలు పర్యవేక్షిస్తారని తెలిపారు.
42,602 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు
ఏలూరు (మెట్రో): తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఓటర్ల తుది జాబితాను సోమవారం అధికారులు విడుదల చేశారు. ఏలూరు జిల్లాలోని 62 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్ల జాబితాను ప్రకటించారు. జిల్లాలో 24,895 పురుష, 17,699 మహిళా గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇతరులు ఎనిమిది మంది ఉండగా మొత్తంగా 42,602 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.
గడువులోపు అర్జీలు పరిష్కరించాలి
భీమవరం: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించారు. బాధితుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, అత్తింటి వేధింపులు, భూ, ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసం, ప్రేమ పేరుతో వంచన, ఆస్తి తగాదాలకు సంబంధించి ఎనిమిది అర్జీలను ఎస్పీ స్వీకరించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment