అమిత్‌షాను బర్తరఫ్ చేయాలి
ఏలూరు (టూటౌన్): పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తక్షణమే క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే కేంద్ర మంత్రి వర్గం నుంచి ఆయన్ను బర్తరఫ్ చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. అమిత్‌షా వ్యాఖ్యలపై మండిపడుతూ నగరంలోని పాత బస్టాండ్ సెంటర్‌లోని అంబేడ్కర్ వి గ్రహం వద్ద సోమవారం నిరసన తెలిపారు. అమిత్‌షా బొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు, ఎంసీపీఐ (యు) నాయకుడు ఎస్.నాగరాజు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సభ్యుడు తలారి ప్రకాష్ మాట్లాడారు. 75 ఏళ్ల భారత రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి వ్యా ఖ్యలు దారుణమన్నారు. అమిత్‌షాను ప్రధాని మోదీ వెనకేసుకురావడం దుర్మార్గమన్నారు. ఈ తరహా ధో రణులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. దేశ లౌ కికతత్వం, మత సామరస్యం, రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు పోరాటమే మార్గమని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణ చైతన్య, రాష్ట్ర సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment