ఉద్యోగమే లక్ష్యంగా..
ఏలూరు టౌన్: ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చేపట్టిన కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. రెండేళ్ల క్రితం ప్రాథమిక ఎంపిక రాత పరీక్షలు పూర్తి కాగా... తాజాగా దేహదారుఢ్య పరీక్షల ను చేపట్టారు. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో సో మవారం తొలిరోజు దేహదారుఢ్య పరీక్షలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరై ప్రతిభను చాటారు. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఉదయం నుంచి గ్రౌండ్స్‌లోనే ఉంటూ పోటీలను పర్యవేక్షించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 600 మంది పురుష అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ చేయగా 309 మంది హాజరయ్యారు. వీరిలో 179 మంది ఎంపికై నట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. జనవరి 9 వరకు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామన్నారు.
లాంగ్ జంప్‌లో సత్తా చాటుతూ..
కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment