ఆక్వాకు లైసెన్స్ తప్పనిసరి
దెందులూరు: ఆక్వా సాగుదారులతోపాటు ఆక్వా అనుబంధ పరిశ్రమల యజమానులు కూడా లైసెన్సులు తీసుకోవాలనే నిబంధనను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్సడా చట్టం–2020 అనుసరించి ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో రైతులు, ఆక్వా అనుబంధ పరిశ్రమల నిర్వాహకులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది.
పథకాలకు లైసెన్సే కీలకం
విద్యుత్ కనెక్షన్ల మంజూరు, వినియోగంపై రాయితీ వర్తింపుతో పాటు చేపలు, రొయ్యల క్రయవిక్రయాలకు లైసెన్సును తప్పనిసరి చేయనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న పథకాలతో పాటు భవిష్యత్‌లో అమలు చేయబోయే పథకాలకూ ఈ లైసెన్సే కీలకం కానుంది. రానున్న రోజుల్లో బీమా సదుపాయం కల్పించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ లైసెన్స్ తప్పనిసరి. చేపలు, రొయ్యలకు సంబంధించి మేతలు, మందుల దుకాణాల యజమానులు, కొనుగోలుదారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులకు చట్టబద్ధత కల్పించేందుకు లైసెన్స్ తప్పనిసరి చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఆక్వా అనుబంధ పరిశ్రమలకూ లైసెన్సులు పొందాల్సిందే
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాల్లో ఆక్వా సాగు వివరాలు
ఆక్వా సాగు విస్తీర్ణం : 2.90 లక్షల ఎకరాలు
చేపల సాగు : 1.80 లక్షల ఎకరాలు
రొయ్యల సాగు : 1.10 లక్షల ఎకరాలు
కొనుగోలు కేంద్రాలు : 120
ప్రాసెసింగ్ యూనిట్లు : 30
దుకాణాలు : 1500
Comments
Please login to add a commentAdd a comment