‘తల్లికి వందనం’ అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘తల్లికి వందనం’ అమలు చేయాలి

Published Thu, Jan 9 2025 1:57 AM | Last Updated on Thu, Jan 9 2025 1:57 AM

‘తల్లికి వందనం’ అమలు చేయాలి

‘తల్లికి వందనం’ అమలు చేయాలి

జంగారెడ్డిగూడెం: తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని అఖిల భాతర విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) డిమాండ్‌ చేసింది. సమాఖ్య ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.వలరాజు, ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తల్లికి వందనం హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఈ విద్యా సంవత్సరానికి అమలు చేయలేనని చెప్పడం సరైన విధానం కాదన్నారు. వెంటనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఈ.శివకుమార్‌, ఎం.క్రాంతి కుమార్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement