కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో ప్రజలకు ఉచిత ఇసుక మరింత అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకుని, అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. ఉచిత ఇసుకకు ఎలాంటి కొరత లేకుండా ప్రజలకు డిసిల్టింగ్ పాయింట్లలో ఉచిత ఇసుక అందుబాటులో ఉంచేందుకు అధికారులు పరిశీలించాలన్నారు. ఏలూరు జిల్లాలోని గూటాల–1, గూటాల –2, పట్టిసీమ డీసిల్టింగ్ పాయింట్లలో ఇసుకను అందుబాటులో ఉంచడంతోపాటు, తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని చిడిపి, ఔరంగాబాద్ ఇసుక రీచ్‌ల ద్వారా ఇసుక సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment