టీడీపీ నేత ఫ్యాక్టరీకి సిమెంట్ రోడ్డు
ఉపాధి నిధులు దుర్వినియోగం
నూజివీడు: పేదలకు, కూలీలకు ఏడాదిలో వంద రోజుల పనిని కల్పించాల్సిన ఉపాధి హామీ పథకం దుర్వినియోగం అవుతోంది. ఏలూరు జిల్లా నూజివీడు మండలం కొత్తరావిచర్లలో ఊరి బయట తోటల్లో ఉన్న ఓ టీడీపీ నాయకుడి ఫ్యాక్టరీ వద్దకు ఉపాధి హామీ పథకంలో సిమెంట్ రోడ్డు వేస్తున్నారు. రూ.15 లక్షలతో చేపట్టిన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. గ్రామాల్లో అవసరమైన చోట సిమెంట్ రోడ్డు నిర్మాణాలు చేయాల్సి ఉండగా ఊరి బయట తోటల మధ్యలో ఉన్న ఫ్యాక్టరీ వద్దకు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టడంపై గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. అధికారులు ఇలా ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం చేయడం సమంజసం కాదంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment