జీసీజీటీఏ కార్యవర్గం ఏకగ్రీవం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ టీచర్ల అసోసియేషన్ (జీసీజీటీఏ) ఏ లూరు జిల్లా శాఖ ఎన్నికలు ఆదివారం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు హాజరై జిల్లాస్థాయి పదవులకు అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎంపికచేశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా బుట్టాయగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు మర్రి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శిగా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు టీవీ రాంబాబు, జిల్లా కోశాధికారిగా కై కలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అ ధ్యాపకుడు కె.రమేష్‌ను ఎంపిక చేశారు. ఎం. రాంబాబు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జీసీటీఏ యూనిట్ సభ్యులు, ప్రిన్సిపాల్ జి.గిరిబాబు సహకరించారు.
అసంపూర్తి రోడ్డు పనులతో ప్రమాదాలు
కుక్కునూరు: మండలంలోని కుక్కునూరు నుంచి బూర్గుంపాడు మధ్యలో చేపట్టిన ఆర్‌అండ్‌బీ రోడ్డు మరమ్మతుల పనులు నిలిపివేయడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వెంటనే పనులు పూర్తి చేయాలంటూ ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో పెద్దరావిగూడెం వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఐ మండల కార్యదర్శి మైసాక్షి వెంకటాచారి మాట్లాడుతూ, మూడు నెలల క్రితం రోడ్డు నిర్మాణ పనులను చేపట్టిన కాంట్రాక్టర్ పనులను పూర్తి చేయకుండా గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంపూర్తిగా వదిలేసిన రోడ్డుపై కంకర తేలి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రోడ్డుపై విపరీతంగా దుమ్ములేస్తోందని, దీంతో సమీపంలోని పంటలు పాడవుతున్నాయన్నారు. వెంటనే ప నులు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. మండల కార్యవర్గ సభ్యుడు మడిపల్లి రమణయ్య, జిల్లా సమితి సభ్యులు కురాకుల బాబురావు, పళ్లాల బిక్షం, సొడే నాగేష్, మారయ్య, కవిత,రాము, యాకుబ్ పాల్గొన్నారు.
రాట్నాలమ్మా పాహిమాం
పెదవేగి : భక్తులపాలిట కొంగు బంగారం రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తా రు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలో చిన్నారులకు అన్నప్రాసనలు, నామకరణలు, అక్షరాభ్యాసాలు చేయించారు. దేవస్థానానికి పూజా టికెట్లపై రూ.42,720, విరాళాల రూపంలో రూ.11,953, లడ్డూ ప్రసాదంపై రూ.21,750, ఫొటోల అమ్మకం ద్వారా రూ 3,475 మొత్తంగా రూ.79,898 ఆదాయం సమకూరిందని ఈఓ ఎన్.సతీష్‌కుమార్ తెలిపారు.
విద్యుత్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మినహాయింపు
డీటీఓ ఉమామహేశ్వరరావు
భీమవరం (ప్రకాశంచౌక్): విద్యుత్ బైకులు, కార్లకు జీవిత పన్ను (లైఫ్ టాక్స్) మినహాయింపు ఇస్తున్నట్టు జిల్లా రవాణా అధికారి టి. ఉమామహేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల నుంచి మినహాయింపు అమలులోకి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం విద్యుత్ వాహనాల ద్వారా కాలుష్యం తగ్గించవచ్చుని సమీక్షించి పన్ను మినహాయింపునకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో కొనుగోలు చేసిన, రిజిస్టర్ చేసుకున్న అన్ని స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నును మినహాయిస్తూ ఐదేళ్ల కాల పరిమితికి (జనవరి 2025 నుంచి జనవరి 2030 వరకు) ఉత్తర్వులు జారీ చేశారన్నారు. పన్ను మినహాయింపు హైబ్రిడ్ వాహనాలకు వర్తించదన్నారు. అలాగే ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ టీఆర్ జారీ చేసిన, ఆంధ్రప్రదేశ్‌లోని డీలర్లు ఇతర రాష్ట్రాలకు టీఆర్‌లు జారీచేసిన వాహనాలకు పన్ను మినహాయింపు వర్తించదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment