ఖైదీలకు సదుపాయాలు కల్పించాలి
నూజివీడు: రిమాండ్ ఖైదీలకు ప్రభుత్వం కల్పించే సదుపాయాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని 15వ అదనపు జిల్లా జడ్జి ఎ.నాగశైలజ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సబ్‌జైలును రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం.శివపార్వతి, డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్, సబ్ కలెక్టర్ బచ్చు స్మరణ్‌రాజ్‌తో కలిసి ఆదివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ రిమాండ్ ఖైదీలకు అందిస్తున్న ఆహార పదార్థాలను, ఇతర సదుపాయాలను పరిశీలించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ రిమాండ్ ఖైదీలకు న్యాయవాదులను పెట్టుకునే స్థోమత లేకపోతే తమ దృష్టికి తీసుకువస్తే ఉచిత న్యాయ సాయం అందేలా చూస్తామన్నారు. ఖైదీలకు వైద్యసాయం అవసరమైతే తక్షణమే అందించాలని జైలు అధికారులకు సూచించారు. డీవైఈఓ ఎం.సేవియా, ఏఓ చాముండేశ్వరి, వైద్యాధికారి నరేంద్రకృష్ణ, ఏఎస్‌డబ్ల్యూఓ శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ ఏఈ అశోక్, జైలు సూపరింటెండెంట్ జి.ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment