వేమన పద్యాలు.. జీవిత సత్యాలు
ఏలూరు(మెట్రో): తేట తెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో శతకాల ద్వారా సమాజాన్ని జాగృతం చేసిన ప్రజాకవి యోగి వే మన అని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా వేమన చిత్రపటానికి కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేమన పద్యాల సందేశాలను భావితరాలకు అందించేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు. వేమన పద్యాలు వికాసానికి దోహదపడతాయన్నారు. ‘ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన’ పద్యాన్ని కలెక్టర్ ఆలపించి తాత్పర్యాన్ని వివరించారు. జేసీ పి.ధాత్రిరెడ్డి ‘అనువుగాని చోట నదికులమనరాదు’ పద్యాన్ని వినిపించి వేమన ఔన్నత్యాన్ని వివరించారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు మా ట్లాడు తూ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయన్నారు. పలువురు అధికారులు వే మన శతకంలోని పద్యాలను వాటి తాత్పర్యాలను వివరించారు. డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు, డీ ఈఓ వెంకటలక్ష్మమ్మ, పశుసంవర్ధక శాఖ ఇన్‌చార్జి జేడీ గోవిందరాజులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎంఎం రాజు, సెట్‌వెల్ సీఈఓ ప్రభాకరరావు, బీసీ కార్పొషన్ ఈడీ ఎన్.పుష్పలత, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్‌వీ నాగరాణి, ఐసీడీఎస్ పీడీ శారద, కలెక్టరేట్ ఏఓ నాంచారయ్య, పర్యాటక శాఖ మేనేజర్ పట్టాభి పాల్గొన్నారు.
కలెక్టర్ వెట్రిసెల్వి
Comments
Please login to add a commentAdd a comment