అమిత్‌షా క్షమాపణ చెప్పాలి
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : పార్లమెంటులో బీఆర్ అంబేడ్కర్‌ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విజయవాడ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆదివారం ఏలూరులో సీపీఎం, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నగర కార్య దర్శి బద్దా వెంకట్రావు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరు శ్రీమన్నారాయణ, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్‌షా క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు అమలుచేయని కేంద్ర మంత్రికి రాష్ట్రంలో పర్యటించే నైతిక అర్హత లేదన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వారికి తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎర్రతివాచీలు పరచడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పి.రామకృష్ణ, నాయకులు పిచ్చుక ఆదిశేషు, ఎ.శ్యామలారాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment