త్యాగాలకు వెనుకాడని సైనికులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దేశ రక్షణలో ఎలాంటి త్యాగాలకై నా సైనికులు ఎప్పడూ సిద్ధంగా ఉంటారని జెడ్‌ఎస్‌డబ్ల్యూ కేవీఎస్ ప్రసాదరావు అన్నారు. ఏలూరు జిల్లా మాజీ సైనిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కోటదిబ్బ వద్ద భారత పదాతిదళ దినోత్సవాలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రసాదరావు మాట్లా డుతూ శత్రువుల వ్యూహాలను తిప్పికొడుతూ దేశ రక్షణలో ఎందరో సైనికులు వీరమరణం పొందుతున్నారన్నారు. మాజీ సైనిక సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ మాజీ సైనికులు, వీర నారీమణుల పింఛన్ సమస్యల పరిష్కారినికి, లైఫ్ సర్టిఫికెట్ నమోదుకు తమ సంఘం కృషి చేస్తోందన్నారు. తొలుత అమర జవాన్ స్థూప ం వద్ద నివాళులర్పించారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 80 ఏళ్లు పైబడిన పలువురు మాజీ సైనికులను సన్మానించారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు కేతినేని భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి బింబార్కర్ రమేష్, ఉపాధ్యక్షుడు శ్యామ్‌గణేష్, బి.సుబ్బారావు, రెడ్డి రామారావు, గౌరవ అధ్యక్షుడు వాసుకీ శర్మ, సభ్యులు సుబ్రహ్మణ్యం, జేవీఆర్ ప్రసాద్, 180 మంది మాజీ సైనికులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment