ఎంపీ కార్యాలయం వద్ద రైతుల ధర్నా
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, గత 56 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ప్రాణాలను కాపాడాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చ పిలుపు మేరకు సోమవారం ఏలూరులో ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ కార్యాలయం వద్ద కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కోసం ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని, మోదీ ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి విడనాడాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, ఏపీ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకుడు రాజనాల రామ్మోహనరావు, బీకేఎంయూ జిల్లా అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎస్‌కే గౌస్ మాట్లాడారు. మోడీ ప్రభుత్వం రాతపూర్వకంగా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్‌కుమార్‌కు వినతి పత్రాన్ని ఎంపీ కార్యాలయ అధికారి కుమారస్వామి ద్వారా అందజేశారు. రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment