అర్జీలకు అర్థవంతమైన పరిష్కారం చూపాలి
కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు(మెట్రో): సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) ద్వారా అందిన అర్జీలకు అర్థవంతమైన పరిష్కారం చూపుతూ అర్జీదారుడి సంతృప్తస్థాయి పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డీఆర్‌డీఏ పీడీ ఆర్.విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.ముక్కంటి, కె.భాస్కర్‌తో కలిసి ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్‌ఎస్‌లో 247 అర్జీలు అందినట్టు కలెక్టర్ చెప్పారు. అర్జీలను క్షేత్రస్థాయిలో విచారించి నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
అర్జీల్లో కొన్ని..
● వట్లూరుకు చెందిన ఉదయ భాస్కరరావు రెండు నెలల క్రితం ప్రమాదంలో కాలును కోల్పోయానని, పింఛన్ అందించాలని అర్జీ అందజేశారు.
● కొత్తవారిగూడేనికి చెందిన రాధామనోహర్ తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం కోరుతూ అర్జీ అందజేశారు.
● కన్నాపురానికి చెందిన వెంకటేష్ తమ గ్రామంలో శ్శశాన వాటికకు వెళ్లే మార్గాన్ని కొందరు ఆక్రమించారని ఫిర్యాదు చేశారు.
● అడవికొలనుకు చెందిన మోషే తమ గ్రామ పంచాయితీ పరిధిలో పాత ఎస్సీ కాలనీలో గ్రామ కంఠం, అక్రమ కట్టడాలు, ఆక్రమణలు తొలగించాలని, పబ్లిక్ టాయిలెట్స్‌ను పరిశుభ్రం చేయాలని, రోడ్డుకు అడ్డుగా ఉన్న మాంస దుకాణాన్ని తొలగించాలని వినతిపత్రం సమర్పించారు.
● లోపూడికి చెందిన పి.నిర్మలాదేవి తన భూమిని ఆన్‌లైన్ చేయాలని అర్జీ అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment