పాలకొల్లు అర్బన్: పట్టణంలోని ఆదిత్య కాలనీకి చెంది పెండ్యాల హరిబాబు (50) ప్రమాదవశాత్తు కాలు జారి పంటకాలువలో పడి మృతి చెందినట్లు పట్టణ ఎస్సై జి.ఫృథ్వీ మంగళవారం రాత్రి విలేకరులకు తెలిపారు. హరిబాబు నరసాపురం రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయంలో వంట మనిషిగా పని చేస్తున్నారు. సోమవారం ఆలయానికి వెళ్లిన హరిబాబు రాత్రికి ఇంటికి చేరుకోలేదని, అతని ఫోన్ కూడా పని చేయడం హరిబాబు భార్య విజయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హరిబాబు మృతదేహం దిగమర్రు పంటకాలువలో పడి ఉండడం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై ఫృథ్వీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పృథ్వీ తెలిపారు.
చోరీ కేసులో ఆరు నెలల జైలు
భీమవరం: భీమవరం ఒకటో పట్టణంలో సెల్‌ఫోన్ దొంగిలిస్తూ పట్టుబడిన వ్యక్తికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని పోలీసులు చెప్పారు. గతేడాది వీరమ్మపార్కు దగ్గర నడిచి వెళ్తున్న ఎన్. రాజ్‌కుమార్‌ను తణుకుకు చెందిన వి. దినకరన్ బెదిరించి అతని వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. పోలీసులకు సమాచారం అందడంతో శ్రీపట్టుకుని అరెస్టు చేసి సీఐ ఎం.నాగరాజు, ఎస్సై బి.వై కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ముద్దాయికి ఆరు నెలలు జైలుశిక్ష విధిస్తూ భీమవరం సెకండ్ ఏజేఎఫ్సీఎం మెజిస్ట్రేట్ డి. ధనరాజు మంగళవారం తీర్పు చెప్పారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment