![ఆక్వా రైతులు బీమా సౌకర్యం పొందాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05erk02-290084_mr-1738787795-0.jpg.webp?itok=K7uKDyw8)
ఆక్వా రైతులు బీమా సౌకర్యం పొందాలి
కై కలూరు: ప్రకృతి వైపరీత్యాలు, వైరస్ వ్యాధులతో మత్స్య సంపదకు నష్టం వాటిల్లినప్పుడు ముందుగా చేయించుకున్న బీమా ఆక్వా రైతులను ఆదుకుంటుందని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్‌ఎఫ్‌డీబీ) సీనియర్ ఎగ్జిక్యూటీవ్ సుష్మా చెప్పారు. ఎన్‌ఎఫ్‌డీబీ ఆధ్వర్యంలో బుధవారం కై కలూరు సీతారామ ఫంక్షన్ హాలులో ప్రధాన మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సాహ్ యోజన(పీఎం–ఎంకేఎస్‌ఎస్‌వై) కింద ఆక్వా కల్చర్ ఇన్సూరెన్సుపై ఆక్వా రైతులకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సుష్మా మాట్లాడుతూ చెల్లించిన ప్రీమియంలో 40 శాతం కేంద్ర ప్రభుత్వం ఒకేసారి ప్రోత్సాహకాన్ని రైతు ఖాతాలో వేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, సీ్త్రలకు మరో 10 శాతం అదనపు ప్రోత్సాహకం ఉంటుందన్నారు. ఒక హెక్టారుకు రూ.25,000, అదే విధంగా 4 హెక్టార్లకు రూ.లక్ష వరకు ప్రోత్సాహం పొందవచ్చాన్నారు. రాష్ట్రంలో 5 ఇన్సూరెన్సు కంపెనీలకు అవకాశం కల్పించారన్నారు. ఏలూరు జిల్లా మత్స్యశాఖ అధికారి సిహెచ్.నాగలింగచార్యులు మాట్లాడుతూ దేశస్థాయి ఉత్పత్తుల్లో ఏపీ నంబర్‌వన్ ఉండగా, అందులో ఏలూరు జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు ముదునూరి సీతారామరాజు, ఎంపీటీసీ మంగినేని రామకృష్ణ, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ అండ్రాజు శ్రీనివాసరావు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ నీలాద్రి, రైతులు చదలవాడ శేషగిరిరావు, సయ్యపురాజు గుర్రాజు, పెన్మత్స త్రినాథరాజు, భాష్యం కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment