నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో పలు సంస్థలు నిర్వహించిన క్యాంపస్ సెలెక్షన్స్‌లో 46 మంది ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం విద్యార్థులు పలు ఉద్యోగాలకు ఎంపికై నట్లు నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. ఇన్ఫోసిస్ సంస్థ నిర్వహించిన సెలక్షన్స్‌లో 25 మంది హాజరుకాగా అందులో 22 మంది ఎంపికయ్యారు. వీరిలో 20 మంది సీఎస్‌ఈ విద్యార్థులు కాగా, ఈసీఈ విద్యార్థులు ఇద్దరు ఉన్నారు. ఎంపికై న 22 మంది బాలికలే కావడం గమనార్హం. అలాగే హెటెరో డ్రగ్స్‌కు కెమికల్ ఇంజినీరింగ్‌కు చెందిన 18 మంది విద్యార్థులు జూనియర్ ఇంజినీర్లుగా ఎంపికయ్యారు. వీరిలో 10 మంది బాలురు, 8 మంది బాలికలు ఉన్నారు. శ్రీకర కనస్ట్రక్షన్స్‌కు 6గురు సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థినులు ఎంపికయ్యారు. వీరిని డైరెక్టర్‌తో పాటు ఏఓ బీ లక్ష్మణరావు, డీన్ అకడమిక్ చిరంజీవి తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment