గోదావరిలో నీటిస్థాయి పరిశీలన | - | Sakshi
Sakshi News home page

గోదావరిలో నీటిస్థాయి పరిశీలన

Published Sun, Feb 9 2025 12:26 AM | Last Updated on Sun, Feb 9 2025 12:26 AM

-

పోలవరం రూరల్‌: గోదావరి నది పరీవాహక ప్రాంతంలో వాటర్‌ లెవెల్స్‌ను జీఆర్‌ఎంబీ చైర్మన్‌ ఏక ప్రధాన్‌ శనివారం పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో నీటిస్థాయిలు, డయాఫ్రమ్‌ వాల్‌, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును ఇంజనీరింగ్‌ అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఆయకట్టు పరిధిలో ఎన్ని లిఫ్టులు ఉన్నాయి, ఎన్ని పంటలకు నీరు అందిస్తున్నారు అనే విషయాలను తెలుసుకున్నారు. ముందుగా తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను పరిశీలించినట్టు అధికారులు తెలిపారు. ఆయన వెంట జీఆర్‌ఎంబీ మెంబర్‌ సెక్రటరీ అగస్త్యన్‌, డీఈ సత్యదేవ్‌, రామేశ్వరనాయుడు, జేఈ భద్రరావు ఉన్నారు.

ప్రశాంతంగా ఇంటర్‌ ప్రాక్టికల్స్‌

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో శనివారం ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 31 కేంద్రాల్లో 4,545 మంది ఒకేషనల్‌ విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం షిఫ్ట్‌లో 2,450 మందికి 2,386 మంది, మధ్యాహ్నం షిఫ్ట్‌లో 2,253 మందికి 2,159 మంది హాజరయ్యారని ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్‌ తెలిపారు.

ఉత్తమ సేవలు అందించాలి

ఏలూరు (టూటౌన్‌): దివ్యాంగులకు ప్రత్యేక ఉపాధ్యాయులు ఉత్తమ సేవలు అందించాలని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ పిలుపునిచ్చారు. స్థానిక దొండపాడులోని ఎడ్యుకేషనల్‌, టెక్నికల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. డీఈఓ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాల ద్వారా తెలుసుకున్న అంశాలతో ది వ్యాంగుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ బి.రామ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆధునిక విద్యా విధానాలను తెలుసుకొని దివ్యాంగులకు సేవలు అందించాలన్నారు. అనంతరం సంస్థ గ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎస్‌.పెద్దిరెడ్డి మాట్లాడుతూ తమసంస్థ 37 ఏళ్లుగా పలు శిక్షణ కార్యక్రమా లు ఏర్పాటుచేస్తోందన్నారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులకు సర్టిఫికెట్లు అందించారు. సీఈబీ సెక్రటరీ ఎ.సర్వేవ్వరరా వు, డి.శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీకోసం రద్దు

ఏలూరు(మెట్రో): జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో మీకోసం కా ర్యక్రమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశా రు. సోమవారం ఏలూరు కలెక్టరేట్‌తో పాటు డి విజన్‌, మండల, మున్సిపల్‌ కార్యాలయా ల్లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు కలెక్టర్‌ వెట్రిసెల్వి తెలిపారు.

ద్వారకాతిరుమల క్షేత్రంలో వ్యాపారి దురుసు ప్రవర్తన

ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఓభక్తుడిపై ఫ్యాన్సీ షాపు వ్యాపారి శనివారం దురుసుగా ప్రవర్తించాడు. అధికారులు వ్యాపారికి రూ.5 వేల జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే.. దెందులూరు మండలం కొవ్వలికి చెందిన గండికోట మోహన్‌ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. కొండపైన దేవస్థానం షాపింగ్‌ కాంప్లెక్స్‌లో గాజులు కొనుగోలుకు వెళ్లగా బేరాలు ఏంటని వ్యాపారి అత డి చేతిలోని డబ్బులను లాక్కున్నాడు. దీనిపై ప్రశ్నిస్తే అదే షాపులో పనిచేస్తున్న మరో ఇద్దరు భక్తుడి మీదకు దురుసుగా వెళ్లి నోటికొచ్చినట్టు తిట్టారు. దీంతో భక్తుడు ఆలయ ఏఈఓ ఆర్‌.లక్ష్మణస్వామికి ఫిర్యాదు చేయగా ఆయన వ్యాపారికి రూ.5 వేల జరిమానా విధిస్తున్నట్టు ఫిర్యా దుల పుస్తకంలో రాశారు.

సముద్ర తాబేళ్ల పరిరక్షణకు చర్యలు

నెల్లూరు(అర్బన్‌): సముద్ర తాబేళ్ల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు, మత్స్య, మైరెన్‌ తదితర శాఖల సమన్వయంతో యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేశామని రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఏకే నాయక్‌ తెలిపారు. తాబేళ్ల అవసరం, వాటిని కాపాడుకోవడం అనే అంశంపై వివిధ జిల్లాల అటవీశాఖ అధికారులు, ట్రీ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నెల్లూరులో వర్క్‌షాపు నిర్వహించారు. నా యక్‌ మా ట్లాడుతూ ఇటీవల తీరంలో 2 వేల నుంచి 3 వేల వరకు తాబేళ్లు మృతి చెందాయన్నారు. మత్స్యకారులు సముద్రంలో వారికి కే టాయించిన దూరం వెళ్లకుండా భారీ యంత్రాలతో కూడిన బోట్లను, మెకనైజ్డ్‌ వలలను వాడటమే కారణమన్నారు. మత్స్యకారులకు అవ గాహన కల్పించాలన్నారు. ఏలూరు, బాపట్ల తదితర జిల్లాల ఫారెస్ట్‌ అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement