సూపర్ సిక్స్ అమలులో బాబు విఫలం
ఏలూరు (ఆర్‌ఆర్ పేట): ఎన్నికలకు ముందు చంద్రబాబు సూపర్ సిక్స్ ఇస్తామని నోరు జారి, అధికారంలోకి వచ్చాక అమలుపై చేతులెత్తేశాడని, దీంతో ప్రజలు నిరాశతో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. శనివారం స్థా నికంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొల్లేరు భూ ఆక్రమణలపై కమిషన్ వేసి విచారణ జరిపి, ఆక్రమణదారులను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నెలాఖరులోపు కొల్లేరుకు వచ్చి భూ ఆక్రమణలను పరిశీలించాలని సూచించారు. చంద్రబాబుకు దమ్ముంటే పోలవరంపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలన్నారు. రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారని, అయితే దళిత విభజన రాష్ట్ర విభజనకు దారితీసిందన్నారు. మిశ్రా కమిషన్ వేసి జిల్లాల్లో తిరు గుతూ తెలుగుదేశం పార్టీ మాలమాదిగలకు తగాదాలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిశ్రా కమిషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ వల్ల ఆంధ్రాలో నూటికి 90 శాతం ఉన్న మాలలు చంద్రబాబుపై కోపంగా ఉన్నారని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment