మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
మన్యం బంద్‌కు
సంపూర్ణమద్దతు
బుట్టాయగూడెం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు 1/70 చట్టంపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఈనెల 11, 12 తేదీల్లో జరిగే మన్యం బంద్‌కు సంపూర్ణ మ ద్దతు తెలుపుతున్నా నని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు చెప్పారు. మండలంలోని దుద్దుకూరులో శనివారం విలేకరులతో మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఏజెన్సీ ప్రాంతంలో అమలవుతున్న 1/70 చట్టం సవరణకు సాధ్యమయ్యే అంశాలను పరిశీలించాలని మాట్లాడటం శోచనీయ మని అన్నారు. ఆ చట్టం గిరిజనులకు రక్షణ కవచం లాంటిదని, స్పీకర్‌గా బాధ్యతగల పద వీలో ఉండి చట్టాలను అమలు చేయాల్సింది పోయి గిరిజనులకు అన్యాయం చేయాలని చూ డటం సబబు కాదన్నారు. 1/70 చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. గిరిజన చట్టాలపై అవగాహన, గౌరవం లేని వ్యక్తి స్పీకర్‌గా ఉండటం రాష్ట్ర ప్రజల దౌ ర్భాగ్యమని బాలరాజు విమర్శించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు గిరిజనులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల కోసం తాను పోరాటం చేయడానికై నా సిద్ధమన్నారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు వైఖరి ఏంటో చెప్పాలని బాలరాజు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment