![ప్రగత](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/08bvrm01-608121_mr-1739040709-0.jpg.webp?itok=0LIWr1w8)
ప్రగతి..అధోగతి
12 నుంచి బధిరుల పోటీలు
భీమవరంలో ఈనెల 12, 13వ తేదీల్లో 5వ రాష్ట్రస్థాయి బధిరుల టీ–20 క్రికెట్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నారు. 8లో u
పశ్చిమగోదావరి జిల్లాకు తలమానికంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కళాశాల, ఆక్వా వర్సిటీ పనులకు కూటమి సర్కారు నిర్లక్ష్య గ్రహణం పట్టింది. ఇప్పటికే మెడికల్ కళాశాల నిర్మాణాలు నిలిచిపోగా ఆక్వా వర్సిటీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాకు కీలకమైన ఈ రెండు అభివృద్ధి పనులపై కూటమి ప్రజాప్రతినిధులు పట్టనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం.
ఆదివారం శ్రీ 9 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
సాక్షి, భీమవరం: పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడం, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. రూ.475 కోట్ల వ్యయంతో పాలకొల్లు మండలం దగ్గులూరు వద్ద సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో 16 బ్లాకులుగా కళాశాల భవన నిర్మాణ పనులు చేపట్టారు. ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, ఎమర్జెన్సీ సేవల బ్లాకులకు సంబంధించి సుమారు రూ.74.5 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. పాలకొల్లులో మెడికల్ కళాశాల ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందడంతో పాటు పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలోని పలు గ్రామాలు అభివృద్ధి చెంది ఎందరికో ఉపాధి లభిస్తుందని అంతా భావించారు. పనులు నిలిచిపోవడం వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. పనులు పూర్తయిన మేర బిల్లులు చెల్లింపు చేయకపోవడంతో కొద్దినెలలుగా నిర్మాణ సంస్థ పనులను నిలిపివేసింది. స్థలంలోని ఐరెన్, ఇసుక, కంకర, ఇతర నిర్మాణ సామగ్రిని వేరే ప్రాంతానికి తరలించుకుపోతోంది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే హోదాలో తరచూ మెడికల్ కళాశాల నిర్మాణ స్థలం వద్దకు వచ్చి హడావుడి చేసిన నిమ్మల రామానాయుడు కూటమి ప్రభుత్వంలో మంత్రి అయ్యాక అటువైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు ఉన్నాయి.
‘ఆక్వా’ంక్షలు ఫలించలేదు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2.53 లక్షల ఎకరాల ఆక్వా సాగు ఉంది. జిల్లాలో 15కు పైగా ప్రాన్స్ ప్రాసెసింగ్ ప్లాంట్లద్వారా రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవు తున్నాయి. చేపలు, రొయ్యల మేతలు, చెరువుల నిర్వహణ సామగ్రి అమ్మకాలు, పట్టుబడి, ప్రా సెసింగ్ ప్లాంట్లు, రవాణా తదితర రూపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించే దిశగా గత ప్రభుత్వం జిల్లాకు ఆక్వా వర్సిటీని మంజూరు చేసింది. యూనివర్సిటీ కోసం నరసాపురం పక్కనే గల లిఖితపూడిలో 40 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, క్యాంపస్ కాలేజీ, బాయ్స్, గరల్స్ హాస్టల్ భవన నిర్మాణాల కోసం రూ.100 కోట్లు మంజూరు చేశారు. తాత్కాలికంగా నరసాపురంలోని తుఫాన్ షెల్టర్ భవనంలో గతేడాది నవంబరు నుంచి 66 సీట్లతో బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ తరగతులను ప్రారంభించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో 1992లో క్యాంపస్ కళాశాల ప్రారంభించగా నరసాపురంలోని కళాశాల రాష్ట్రంలోనే రెండోవది.
నత్తనడకన పనులు
2023 నవంబరులో పనులు ప్రారంభం కాగా ఏడాదిన్నరలోపు పనులు పూర్తిచేయాలన్నది లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు గత ప్రభుత్వంలోనే అడ్మినిస్ట్రేటివ్, కళాశాల భవనాలకు సంబంధించి పనులు శ్లాబ్ దశకు చేరుకోగా బాయ్స్, గరల్స్ హాస్టల్ భవనాలకు పునాదులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు రూ.40 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. కూటమి ప్రభుత్వంలో బిల్లుల విడుదలలో జరుగుతున్న తాత్సారంతో పనులు మందగించాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులను బట్టి పనులు చేయనున్నట్టు నిర్మాణ వర్గాలు చెబుతున్నాయి.
న్యూస్‌రీల్
జాడలేని అభివృద్ధి
అర్ధాంతరంగా నిలిచిన ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులు
సామగ్రిని తరలించుకుపోయిన నిర్మాణ సంస్థ
ఆక్వా వర్సిటీకి నిర్లక్ష్య గ్రహణం
జిల్లాకు రూ.575 కోట్లతో వైద్య కళాశాల, ఆక్వా వర్సిటీ మంజూరు చేసిన గత ప్రభుత్వం
అప్పట్లోనే రూ.114 కోట్ల విలువైన పనులు పూర్తి
![ప్రగతి..అధోగతి 1](https://www.sakshi.com/gallery_images/2025/02/9/08bvrm02-608121_mr-1739040709-1.jpg)
ప్రగతి..అధోగతి
![ప్రగతి..అధోగతి 2](https://www.sakshi.com/gallery_images/2025/02/9/08jrgpolr03-290034_mr-1739040709-2.jpg)
ప్రగతి..అధోగతి
Comments
Please login to add a commentAdd a comment