![వరుడై](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/08jrgdwa01-290069_mr-1739040710-0.jpg.webp?itok=wLiBplcy)
వరుడైన నారసింహుడు
సుందరగిరిపై కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం దత్తత ఆలయం ఐఎస్ జగన్నాథపురం సుందరగిరిపై కొలువైన స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం ఉదయం స్వామివారు పెండ్లి కు మారుడిగా, కనకవల్లీ, లక్ష్మి అమ్మవార్లు పెండ్లి కుమార్తెలుగా ముస్తాబయ్యారు. ముందుగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ పెండ్లి ముస్తాబు తంతు జరిపించారు. ఆలయ డీఈఓ బాబురావు పట్టువస్త్రాలను సమ ర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచన, రుత్విగ్వరణ, అంకురార్పణ, కలశస్థాపన, ధ్వ జారోహణ, అగ్నిప్రతిష్టాపన వేడుకలు జరిగాయి. వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. దేవస్థానం సూపరింటెండెంట్లు రమణ రాజు, దుర్గాప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఉత్సవాల్లో నేడు : ఉదయం 8 గంటల నుంచి.. నిత్య హోమాలు, మూలమంత్ర హవనాలు, బలిహరణ, వేద పారాయణ, ఔపోసన, మండప పూజలు, హారతి, మంత్ర పుష్పాల సమర్పణ.
● సాయంత్రం 6 గంటల నుంచి.. మూలమంత్ర హవనాలు, బలిహరణలు, హారతి, మంత్రపుష్పాల సమర్పణ.
● సాంస్కృతిక కార్యక్రమం.. రాత్రి 7 గంటల నుంచి కూచిపూడి నృత్య ప్రదర్శనలు.
![వరుడైన నారసింహుడు 1](https://www.sakshi.com/gallery_images/2025/02/9/08jrgdwa03-290069_mr-1739040710-1.jpg)
వరుడైన నారసింహుడు
Comments
Please login to add a commentAdd a comment