రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో గుంటూరు జట్ల జయక
తెనాలి: ఆంధ్రప్రదేశ్ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ 68వ రాష్ట్రస్థాయి అండర్–14 బాలురు, బాలికల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో గుంటూరు జిల్లా జట్లు విజయకేతనం ఎగురవేశాయి. బాలుర విభాగంలోనూ, బాలికల విభాగంలోనూ గుంటూరు జిల్లా జట్టు ఫైనల్స్‌లో తమ ప్రత్యర్థి జట్లను ఓడించి, విన్నర్స్‌గా నిలిచాయి. ఈనెల 26న స్థానిక స్టేడియం మైదానంలో ప్రారంభమైన ఈ పోటీలు సోమవారంతో ముగిశాయి. బాలుర విభాగంలో చిత్తూరు జిల్లా జట్టు రన్నర్స్ స్థానాన్ని కైవసం చేసుకోగా, ప్రకాశం జిల్లా జట్టు తృతీయ స్థానం దక్కించుకుంది. బాలికల విభాగంలో కృష్ణాజిల్లా జట్టు రన్నర్స్‌గా నిలవగా, ప్రకాశం జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. పోటీల అనంతరం జరిగిన సభలో రోటరీక్లబ్, తెనాలి వైకుంఠపురం అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి దేవయజనం మురళీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ కోశాధికారి ఈదర వెంకట పూర్ణచంద్, స్వర్ణ హోటల్ అధినేత సుధీర్‌బాబు, గుంటూరు జిల్లా స్కూల్‌గేమ్స్ కార్యదర్శి ఎం.రవి, అసిస్టెంట్ సెక్రటరీ బి.రమేష్‌బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సీహెచ్ వినయ్‌కుమార్‌లు విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు, మెడల్స్‌ను బహూకరించారు. టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన తెనాలి డబల్‌హార్స్ యాజమాన్యానికి, రోటరీ క్లబ్‌కు, స్వర్ణ హోటల్‌కు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. టోర్నమెంటు ముగిసిన తదుపరి, నవంబరు నెలాఖరులో చత్తీస్‌ఘడ్‌లో జరగనున్న జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టును ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment