రక్తదానంతో ప్రాణదాతలుకండి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎస్పీ సతీష్‌కుమార్ చెప్పారు. అమరవీరుల స్మారకోత్సవాల్లో భాగంగా నగరంపాలెం పోలీస్ కల్యాణ మండపంలో సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ రక్తదానంపై అపోహలు వద్దని చెప్పారు. రక్తదానం చేసేందుకు వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బంది, యువకులు, విద్యార్థులను అభినందించారు. విధి నిర్వహణతోపాటు ఆరోగ్యంపై పోలీసులు శ్రద్ధవహించాలని సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ప్రముఖ వైద్యులతో వ్యాధినిర్ధారణ పరీక్షలు చేయించి చికిత్స అందించారు. గుంటూరు జీజీహెచ్, ఆంధ్ర ప్రైమ్ ఆసుపత్రి, రమేష్ ఆసుపత్రి, ఒమేగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, డీఎస్పీలు శాంతకుమార్ (ఏఆర్), బి.సీతా రామయ్య (ఎస్‌బీ), ఆర్‌ఐలు హరిరెడ్డి, శివరామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment