ఆస్తి కోసం దారుణం
కన్నతండ్రిని చంపిన కుమారుడు
ప్రత్తిపాడు: ఆస్తి కోసం కొడుకే కన్నతండ్రిని మంచం కోడుతో కిరాతకంగా కొట్టి హత్య చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రత్తిపాడు మండలం చినకోండ్రుపాడుకు చెందిన తోక వెంకట రామయ్య (60) స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆయన రెండు వివాహాలు చేసుకున్నాడు. మొదటి భార్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండవ భార్యకు సంతానం లేదు. ఈ నేపథ్యంలో మొదటి భార్య కుమారుడు వెంకటకృష్ణ ఆస్తిలో వాటా ఇవ్వాలని తండ్రిని కొంతకాలంగా వేధిస్తున్నాడు. వెంకటకృష్ణకు అతని భార్య కూడా సహకరించేది. ఇద్దరూ కలిసి వెంకటరామయ్యపై ఒత్తిడి తీసుకువచ్చారు. తనకున్న ఎనిమిది సెంట్లులో నాలుగు సెంట్లు కొడుకు, కోడలి పేరుతో ఆయన రాసిచ్చాడు. అయినప్పటికీ సంతృప్తి చెందని కుమారుడు మిగిలిన ఆస్తి కోసం గత కొంతకాలంగా తండ్రితో గొడవ పడుతున్నాడు. కొడుకు, కోడలు కలిసి వెంకటరామయ్యపై కేసులు పెట్టారు. దీంతో వెంకట్రామయ్య సొంత ఇంటిని వదిలేసి వేరే ఇంటికి వెళ్లిపోయాడు. కుమారుడు కూడా భార్య స్వగ్రామానికి వెళ్లిపోవడంతో గొడవలు సర్దుమణిగాయి. వెంకటరామయ్య తిరిగి కోండ్రుపాడులోని సొంత ఇంటికొచ్చి ఉంటున్నాడు. మంగళవారం రాత్రి అక్కడికి కుమారుడు వచ్చాడు. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. ఇంతలో వెంకట రామయ్య రావడంతో ఆస్తి విషయమై వాగ్వాదం చోటుచేసుకుంది. వెంకటకృష్ణ మంచం కోడు తీసుకుని తండ్రి తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ నాగేంద్రలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద మంగళవారం 7427 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు 306 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్‌కు 1760 క్యూసెక్కులు, తూర్పు కెనాల్‌కు 650 క్యూసెక్కులు, పశ్చిమ కెనాల్‌కు 178 క్యూసెక్కులు, నిజాంపట్నం కాలువకు 387 క్యూసెక్కులు, కొమ్మమూరు కాలువకు 3200 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment