కోటి కాంతులు
పుణ్యక్షేత్రం అమరావతి అమరేశ్వరాలయంలో మంగళవారం నర్సారావుపేటకు చెందిన శ్రీబాలచాముండి కాసమేత అమరేశ్వరస్వామి ఆధ్యాత్మిక సేవాసమితి, అమ్మ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. అలయంలో స్వామి ఎదురుగా వేదపండితులు మంత్రోచ్చారణల మధ్య పూజలు నిర్వహించిన అనంతరం భగవన్నామ సంకీర్తనలు, మేళాతాళాల నడుమ కోటి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు కోటి వత్తులతో దీపాలను వెలిగించారు. తొలుత స్వామికి దాతల సాయంతో లక్ష బిల్వార్చన నిర్వహించారు. బాలచాముండికా అమ్మకు లక్ష కుంకుమార్చనలు చేశారు. – అమరావతి
స్థానిక శ్రీ వీర్ల అంకమ్మ తల్లి ఆలయంలో కోటి దీపోత్సవం సోమవారం రాత్రి కన్నుల పండువలా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళ భక్తులు దీపాలు వెలిగించారు. దీపాలు వెలిగించి పూజలు చేశారు. అనంతరం అష్ట దేవతమూర్తుల కల్యాణం భక్తిశ్రద్ధలతో జరిపించారు. కోటిదీపోత్సవం సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది.
– దాచేపల్లి
Comments
Please login to add a commentAdd a comment